పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని సమీప లక్ష్మీపురం, వీర్లపల్లి గ్రామాల నిర్వాసితులు కర్మాగారం ఎదుట ధర్నా నిర్వహించారు. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారం.. అవసరాల నిమిత్తం 1991లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు రెండు వందల ఎకరాల భూమిని తీసుకుందని.. ఆ సమయంలో నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఎరువుల కర్మాగారం మూత పడిందని తిరిగి ఆర్ఎఫ్సీఎల్ పేరుతో ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న క్రమంలో కనీసం తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సమీప గ్రామాల భూ నిర్వాసితుల కుటుంబాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి