కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి జలాశయం నుంచి 6 వేల 300 క్యూసెక్కుల నీరు నందిమేడారం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. ఇంతే మొత్తం నీటిని ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంపుహౌస్‌కు వదులుతున్నారు. పంపుహౌస్‌లోనూ రెండు మోటార్లను నడిపిస్తూ... వరదకాలువ ద్వారా మధ్యమానేరు జలాశయానికి నీటిని తరలిస్తున్నారు.
నీటిపారుదల శాఖ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏఈలు ఎత్తిపోతలను పర్యవేక్షిస్తున్నారు. మధ్య మానేరు జలాశయం నుంచి ఎల్ఎండీకి ఆరు గేట్ల ద్వారా 6 వేల 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మానేరు వాగులోని బావులు, బోర్ల వద్ద ఉన్న వ్యవసాయ మోటార్లను రైతులు తొలగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 12ఏళ్లు దాటితే వ్యాక్సిన్.. కెనడా అనుమతి!