పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎక్లాస్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. 27 ఏళ్ల యువకుడు, గ్రామ రెవెన్యూ సహాయకుడు గువ్వల మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండేళ్లుగా రెవెన్యూ అధికారులు జీతం ఇవ్వక పోవడం వల్లే, ఆర్థిక ఇబ్బందులు పెరిగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని అన్న రాజశేఖర్ తెలిపారు. వీఆర్‌ఏ మృతితో పరిసర వాతావరణంలో విషాదం నెలకొంది.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్‌లో కొత్త ఫీచర్స్