కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక పరిధిలో వ్యాపార, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు గురువారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. వ్యాపారులు, సుల్తానాబాద్ పురపాలక పాలకవర్గ సభ్యులు అంతా కలిసి సమావేశం నిర్వహించారు. గురువారం నుంచి ఈ నెల 30 వరకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా నేడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుకాణాలు అన్నింటినీ మూసివేశారు. ప్రజలు కూడా ఒంటి గంటలోపే ఇళ్లకు చేరడం వల్ల ప్రధాన కూడళ్లు బోసిపోయాయి. గత వారం రోజుల వ్యవధిలో సుల్తానాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్యా పెరిగింది.
స్వచ్ఛంద లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధించాలని తీర్మానం చేశారు.
ఇదీ చూడండి: స్పుత్నిక్ లైట్ పేరుతో కొత్త టీకా- ఒక్క డోస్‌తోనే రక్ష!