పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వేదవ్యాస మహర్షి జయంతి వేడుకలు గంగపుత్రులు ఘనంగా నిర్వహించారు .ఈ మేరకు గోదావరిఖనిలో రామగుండం కార్పొరేషన్ ఏరియా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
పట్టణంలోని ఫిల్టర్ బెడ్ సమీపంలో గోదావరి మాతకు హారతి ఇచ్చిన అనంతరం నదిలో దీపాలు వదిలి గంగమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ గంగపుత్ర సంఘం నాయకులు సత్యం ర్యాలీగా లక్ష్మీనారాయణ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్