పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి ప్రధాని మోదీ వస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఎరువుల కర్మాగారంలో గత ఏడాదిన్నరగా ట్రయల్ నిర్వహిస్తూ లోపాలను సరి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగా.. మరోసారి ఇబ్బందులు తలెత్తాయి. యూరియా తయారీకి ఉపయోగించే అమ్మోనియా పైపు లీకేజీతో అధికారులు మరోసారి అప్రమత్తమై ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు.
ఈ నెల 9న రాత్రి లీక్ కాగా.. ఉత్పత్తిని 50 శాతానికి తగ్గించి మరమ్మతు చేయాలని భావించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఫ్లాంట్‌ను పూర్తిగా నిలిపివేసి.. మరమ్మతులు చేపడుతున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించిన అనంతరం.. ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే గ్యాస్ లీకేజీ పైప్ మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా.. ప్లాంట్ సందర్శనపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇవీ చూడండి..
రాష్ట్రానికి కల్పతరువు.. రామగుండం ఎరువు.. దీని ప్రత్యేకతలివే!