ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం భాజపా అభ్యర్థి ఎస్.కుమార్కు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు భాజపా నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన సామగ్రిని సమకూర్చారు.
యూపీ పోలీసు ఉన్నతాధికారుల పరిశీలన
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం 10 గంటలకు సభకు హాజరవుతారని భాజపా నేతలు వెల్లడించారు. శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసు అధికారులు సైతం విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీఎం వచ్చే హెలిప్యాడ్ ప్రాంగణాన్ని DCP సుదర్శన్ గౌడ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సభ సందర్భంగా యూపీ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు సైతం పెద్దపల్లిలో పరిస్థితిని సమీక్షించారు.
ఇవీ చూడండి: నిబంధనలు మాకే కాదు... మీకు కూడా