పెద్దపల్లి జిల్లా మంథని బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీని రక్షిద్దాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం డిపో నుంచి బస్టాండ్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు అక్కడి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. గత 50 రోజులుగా సమ్మె చేస్తున్నా కేసీఆర్ మొండి వైఖరితో వ్యవహరిస్తూ వేతనజీవుల్ని ఇబ్బందులు గురిచేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 'ఎర్ర బస్సులు ముద్దు ప్రైవేటు బస్సులు వద్దు' అనే నినాదాలతో మంథని పట్టణంలో ఆర్టీసీ కార్మికులు హోరెత్తించారు.
ఇవీ చూడండి: వంతెన పై నుంచి కారుపై పడిన మరోకారు.. మహిళ మృతి