పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో తెరాస ఆవిర్భాన దినోత్సవ వేడుకలను నిరాడంబరంగ నిర్వహించారు. గోదావరిఖని పట్టణంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. తన క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. రామగుండం నగరపాలక సంస్థలోని పలువురు కార్పొరేటర్లు తమ ఇళ్లపై తెరాస జెండాలను ఎగురవేయడం అభినందనీయమన్నారు.
అనంతరం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంజి అనిల్‌కుమార్, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం