పెద్దపులి సంచారంతో పెద్దపల్లిలోని పలు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత 20 రోజులుగా పెద్దపల్లి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. మంగళవారం ఉదయం కమాన్పూర్ మండలం గుండారంలో వ్యవసాయ క్షేత్రాల్లో పులి పాదముద్రలు కనిపించాయి.
గత 20 రోజులుగా ముత్తారం, మంథని, రామగిరి, కమాన్పూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అడవుల్లో సంచరిస్తూ అనువైన ఆవాసం కోసం వెతుకుతోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులిని గుర్తించేందుకు అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈనెల ఏడున మంథని మండలం మర్చి పేట సమీపంలోని ఓ పశువుల మందపై దాడిచేసి ఐదు పశువులను గాయపరిచి, ఒక దాన్ని చంపి తినేసిన ఘటన మరవక ముందే ఇతర గ్రామాల్లో సంచారం కలవరపెడుతోంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో తాజాగా 2,058 మందికి కరోనా