న్యాయవాది వామన్‌రావు దంపతులు వేసిన కేసులకు భయపడే వారిని అతికిరాతకంగా హత్య చేయించారని ఆయన తండ్రి కిషన్‌రావు ఆరోపించారు. ఈ హత్యలో పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొన్నారని ఆక్షేపించారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో ఫిర్యాదు తీసుకున్న రామగిరి ఎస్సై... దర్యాప్తులో నిందితులందరూ బయటపడతారని తెలిపినట్లు వెల్లడించారు. అసలైన నిందితుల పేర్లు ఇప్పటికీ చేర్చలేదన్నారు.
ఈ కేసులో విచారణ సరిగా జరగలేదని... ఏప్రిల్ 16 న ఐజీ నాగిరెడ్డికి రెండు పేజీల లేఖను రాసినట్టు తెలిపారు. అవసరమైతే తనపై నార్కో టెస్ట్ కూడా చేయమన్నట్టు వెల్లడించారు. గ్రామ, మండల స్థాయి నుంచి హైదరాబాద్ వరకు పలువురి హస్తం ఈ హత్యలో ఉందన్నారు. ఈ హత్యలో పుట్టమధుతో పాటు, కమాన్‌పూర్ మార్కెట్ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ భాగస్వామ్యం కూడా ఉందని ఆరోపించారు.