ETV Bharat / state

'పుట్ట మధుకర్​పై ఆ ఎంపీపీ దంపతుల ఆరోపణలు అవాస్తవం' - pedapalli political news

Allegations against Peddapalli ZPChairmen Putta Madhu: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, కమాన్​పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణతో తమకు ప్రాణహాని ఉందని.. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క, కొమరయ్య దంపతులు చేసిన ఆరోపణలు అవాస్తవమని రామగిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. రాజకీయ లబ్దికోసమే వారు అలా మాట్లాడారని పేర్కొన్నారు.

brs
brs
author img

By

Published : Mar 5, 2023, 6:10 PM IST

Allegations against Peddapalli ZPChairmen Putta Madhu: రామగిరి మహిళా ఎంపీపీ దేవక్క దంపతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని, వాటిలో నిజం లేదని ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ వీరితో విష ప్రచారం చేయిస్తున్నారని రామగిరి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఎంపీపీ దంపతుల వల్ల మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్ దగ్గరికి వెళ్లే స్థాయి ఎంపీపీ దేవక్క దంపతులకు లేదని, వారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తామని, రామగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవీందర్ హెచ్చరించారు. ఎంపీపీ హోదాలో వారు ఈ స్థాయిలో ఉండడానికి పుట్ట మధు కారణమని, ఇవాళ ఆయనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రామగిరి జెడ్పీటీసీ శారద అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు సృష్టించాలని మీరు చేసిన ఆరోపణలతో ఏకాకిగా మిగిలిపోయారని, అహంకారంతో ఉన్న మిమ్ములను మీ చర్యలను ఖండిస్తున్నామని మండిపడ్డారు.

ఈ సమావేశంలో రామగిరి మండల జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండలాధ్యక్షుడు, రైతు కమిటీ చైర్మన్లు, సమన్వయ కమిటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

ఎంపీపీ ఆరెల్లి దేవక్కపెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుపై చేసిన ఆరోపణలు అవాస్తవం. కాల్ రికార్డు బయటపెడుతానంటోంది. ఆ రికార్డును మీడియా ముందే బయటపెడితే బాగుంటుంది. అబద్దపు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ దగ్గరికి వెళ్లే స్థాయి వీరికి లేదు. వారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తాము.- రవీందర్, రామగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

ఎంపీపీ హోదాలో మీరు ఈస్థాయిలో ఉండడానికి పుట్ట మధు సహకారం అందించారు, ఈరోజు ఆయనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. పార్టీలో విభేదాలు సృష్టించాలని మీరు చేసిన ఆరోపణలతో ఏకాకిగా మిగిలిపోయారు, మీరు అసత్య ఆరోపణలు చేయడానికి వెనుక ఎవరున్నారో అందరికి తెలుసు. అహంకారంతో ఉన్న మిమ్ములను మీ చర్యలను ఖండిస్తున్నాము. -శారద, రామగిరి మండల జెడ్పిటీసీ

అసలేం జరిగిందంటే..

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్​తో తమకు ప్రాణగండం ఉందని రామగిరి మహిళా ఎంపీపీ ఆరెల్లి దేవక్క, కొమురయ్య గౌడ్ దంపతులు ఆరోపించారు. రెండ్రోజుల క్రితం పుట్ట మధు తమను పెద్దపల్లి జడ్పీ కార్యాలయానికి పిలిపించి తలుపులు వేసి బెదిరించి, బూతులు తిట్టాడని ఎంపీపీ దంపతులు ఆరోపించారు. వామనరావు దంపతుల హత్య నడిరోడ్డుపై ఎలా జరిగిందో తెలుసు కదా.. పుట్ట మధు అంటే తెలియదా..? అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్​కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ అనగా.. కేసీఆర్, కేటీఆర్ ఎవరు.. అన్నీ నేనే ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.