'నిధులు తెచ్చే దమ్ము తెరాస ఎంపీలకే ఉంది' పెద్దపల్లి లోక్సభ స్థానానికి తెరాస ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై.. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గ సమస్యలపై లోక్సభలో గళమెత్తి నిధులు తీసుకొచ్చే దమ్ము కేవలం.. తెరాస ఎంపీలకు మాత్రమే వుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ మరింత అభివృద్ధి సాధించడానికి మరోసారి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అసత్యాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్, భాజపాలు దిట్టని విమర్శించారు.ఇవీ చూడండి :'16 సీట్లతో కేసీఆర్ దిల్లీని శాసిస్తారు'