ETV Bharat / state

రామగుండంలో రెండో రోజూ కొనసాగుతోన్న సమ్మె

సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మికుల సమ్మె రెండోరోజుకు చేరింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ... పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో కార్మికులు ఆందోళనకు దిగారు.

Strike continues for the second day in ramagundam mines
రామగుండంలో రెండో రోజూ కొనసాగుతోన్న సమ్మె
author img

By

Published : Jul 3, 2020, 10:25 AM IST

బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 5 జాతీయ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం అర్జీ-1,2,3 ఏరియాల్లో రెండో రోజూ సమ్మె కొనసాగుతోంది. కార్మికులంతా స్వచ్ఛందంగా విధులకు దూరంగా ఉన్నారు. ఫలితంగా గనులన్నీ వెలవెలబోతున్నాయి. సమ్మెకు ఒకరోజు మద్దతు తెలిపిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులు మాత్రం నేడు విధులకు హాజరయ్యారు.

ఈ క్రమంలో జాతీయ సంఘాల నాయకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీలు నిర్వహించి.. రామగుండం రీజియన్‌లోని అన్ని బొగ్గు గనుల ముందు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు సమ్మెకు మద్దతు ఇవ్వాలని.. లేని పక్షంలో రానున్న కాలంలో తగిన బుద్ధిచెబుతామని ఇతర సంఘాల నేతలు హెచ్చరించారు.

ఇదీచూడండి: కరోనాపై పోరులో ఆహారం కీలకం.. సూక్ష్మ పోషకాలే బలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.