ETV Bharat / state

లాక్​డౌన్​ నేపథ్యంలో రామగుండంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా - telangana varthalu

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ కమిషనర్ వి. సత్యనారాయణ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. రామగుండంలో చిత్రీకరించిన డ్రోన్​ దృశ్యాల్లో పట్టణ వీధులు జనసంచారం లేక బోసిపోయి కనిపించాయి.

లాక్​డౌన్​ నేపథ్యంలో రామగుండంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా

author img

By

Published : May 16, 2021, 2:52 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో రామగుండంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా

ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ కమిషనర్ వి. సత్యనారాయణ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లాక్​డౌన్ తీరును రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పర్యవేక్షించారు. పట్టణంలోని వీధుల్లో నుంచి బయట తిరిగే ప్రజల కోసం డ్రోన్ కెమెరా ఏర్పాటు చేసి నిఘా పెంచామని.. అనవసరంగా ఇళ్ల నుంచి బయట తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో రామగుండంలో చిత్రీకరించిన డ్రోన్​ దృశ్యాల్లో పట్టణ వీధులు జనసంచారం లేక బోసిపోయి కనిపించాయి. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీపీ కోరారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ దెబ్బకు రూ.50లక్షలకు పడిపోయిన ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.