సింగరేణి కార్మికుల వేతనాల్లో కోత విధించాలన్న యాజమాన్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన తెలిపారు. వేతనాలతో కూడిన సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని ఉపరితల గనుల్లో ఆందోళన చేపట్టారు.
కార్మికుల వేతనాల్లో కోత విధించడం సరైంది కాదన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి కార్మికులు విధులు బహిష్కరించారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులను విడుదల చేయాలంటూ గోదావరి ఖని రెండో పట్టణ పోలీస్స్టేషన్ వద్ద కార్మికులు నిరసన చేపట్టారు.
ఇవీచూడండి: నా చావుకి పోలీసులే కారణం: యువకుడి సెల్ఫీ