పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని గాంధీనగర్‌లో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే మహిళలంతా భోగిమంటల్లో పాల్గొని సందడి చేశారు. భోగి వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భోగి వేడుకల్లో హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలంతా భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: భోగి పండగ రోజు బీ-ఫారాల భోగం ఎవరికి పట్టనుందో..!