పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అతిపురాతనమైన గణపతి ఆలయంలో సంకట చతుర్థి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, సింధూరంతో విలేపనం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేసి, స్వయంగా భక్తులే స్వామివారికి అభిషేకం చేశారు. సహస్రనామార్చన గావించి, పుష్పాలతో అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, మంగళ హారతులు ఇచ్చారు. సంకట చతుర్థిని పురస్కరించుకొని భక్తులు 108 ప్రదక్షిణలు చేశారు.
ఇదీ చూడండి: 'మూకదాడులు ఆగవు... ఇంకా పెరుగుతాయి'