నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుందని, మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రోడ్డు రవాణా సంస్థ రీజినల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ తెలిపారు. సంవత్సరానికి లక్షా యాభైవేల మంది ప్రమాదంలో చనిపోతున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒకప్పుడు ప్రజలు వ్యాధుల వల్ల మరణించే వారని, నేటి కంప్యూటర్ యుగంలో మాత్రం రోడ్లే నరకానికి దారులు అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీ డ్రైవర్లు ఎల్లవేళలా జాగ్రత్తగా బస్సులను నడపాలని జీవన్ ప్రసాద్ సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2018-19 సంవత్సరానికి మెట్ పల్లి డిపో పరిధిలో అతి తక్కువ ప్రమాదాలు జరగడం వల్ల రాష్ట్రస్థాయిలో జాతీయ అవార్డు తీసుకుందని పేర్కొన్నారు. సమ్మక్క-సారక్క జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు ఏర్పాట్లు చేశారో ఆయన వివరించారు.
ఇవీ చూడండి: ఉద్యోగ విరమణ రోజే ఆత్మహత్య