పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బియ్యం పంపిణీ చేశారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో ప్రైవేట్ ఉపాధ్యయులు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, పాఠశాలల యాజమాన్యలతో వేతనాల విషయం ప్రస్తావించడం జరిగిందన్నారు.
నియోజకవర్గంలోని ప్రైవేట్ ఉపాధ్యయులను అదుకోవడానికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా బియ్యం అందించడం జరిగిందని ఆయన తెలిపారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గౌరవించేంది ఉపాధ్యాయులనేనని, విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రే కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..