సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు భంగం కలిగించినా... విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసి వైరం పెంచకూడదని సూచించారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా మంథని పోలీసు స్టేషన్‌లో శాంతిభద్రతల అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు.
న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య చాలా దురదృష్టకరమైన ఘటన అని, వారికి భద్రత కల్పించలేదనడం అసత్యమన్నారు. భద్రత కావాలని వారు కోరలేదని తెలిపారు. మంథని ప్రాంతానికి చెందిన కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లలో వీఐపీ, సాధారణ రౌడీ షీటర్స్ అనే తేడా ఉండదని... చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మంథని పట్టణంలో పోలీస్ బలగాలతో కలిసి మంగళవారం రాత్రి కవాతు నిర్వహించారు.
ఇదీ చదవండి: కేసుల్లో పెరుగుదల.. ఒక్కరోజే 29వేల మందికి కరోనా