ETV Bharat / state

'నేరాల కట్టడిలో సీసీ కెమెరాలే కీలకం' - Peddapalli District Latest News

పెద్దపల్లి జిల్లా ఎల్కలపల్లి, లక్ష్మిపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఒక్క సీసీకెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామస్థులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.

Ramagundam Police Commissioner Satyanarayana launched CCTV cameras
సీసీ కెమెరాల ప్రారంభంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ
author img

By

Published : Mar 4, 2021, 9:04 PM IST

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. నేర పరిశోధనలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి, లక్ష్మిపురం గ్రామాల్లో రూ. 4 లక్షలతో ఏర్పాటు చేసిన 33 సీసీ కెమెరాలను రామగుండం మేయర్ అనిల్ కుమార్​తో కలిసి సీపీ ప్రారంభించారు.

నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర గొప్పదని సీపీ అన్నారు. గ్రామస్థులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రజల రక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, రామగుండం సీఐ కరుణాకర్, ఎస్సై స్వరూప్ రాజ్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావ్, స్థానిక కార్పొరేటర్ పద్మాగణేశ్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రెండు వేర్వేరు చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.