ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పెద్దపెల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. మునుపటి శేఖర్, కుమ్మరి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి గత కొంత కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో పెద్దపెల్లి జిల్లాలోని ఓ మద్యం దుకాణంలో ఈ ముఠా భారీ దొంగతనానికి పాల్పడింది.
దొంగిలించిన మద్యాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న రామగుండం పోలీసులు ఆదివారం పెద్దపెల్లి జిల్లా అప్పన్నపేట గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపట్టి ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.3 లక్షలు విలువ చేసే మద్యం, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు ట్రాలీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యంతో పాటు వాహనానలు సీజ్ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాలు సైతం దొంగిలించినవే అని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్