పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీఎస్ పరిధిలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) కర్మాగారాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ సందర్శించారు. లాక్డౌన్ నుంచి ఎరువుల తయారీకి మినహాయింపు ఇవ్వడం వల్ల ఇటీవలే ఇక్కడ తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ఫ్యాక్టరీలో పనిచేసే 1400 మంది కూలీల ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అందరు మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని చెప్పారు. కూలీల కోసం ప్రత్యేక పాసులు ఇవ్వాలని ఏసీపీని ఆదేశించారు.
ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు