ETV Bharat / state

'బత్తాయి పండ్లు తినండి... కరోనాను తరిమికొట్టండి'

రోగనిరోధక శక్తిని పెంచేందుకు బత్తాయి ఎంతో దోహద పడుతోందని రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ముందుగా మనం మనోధైర్యంతో ఉండాలని పేర్కొన్నారు.

Ramagundam CP Satyanarayana Distributes Bathai Fruits  for Polices
బత్తాయి పండ్లు తినండి... కరోనాను తరిమికొట్టండి
author img

By

Published : May 13, 2020, 11:20 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలో బత్తాయి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, రామగుండం కమిషనర్​ సత్యనారాయణ పాల్గొని పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్యులకు పండ్లు పంపిణీ చేశారు. బత్తాయి తినటం వల్ల కలిగే లాభాలను సీపీ విడమర్చి చెప్పారు. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోజువారీ దినచర్య సాఫీగా సాగుతుందని అన్నారు.

కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. బత్తాయి పండ్లలో యాంటీ యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.