మంథనిలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 29వ వర్ధంతిని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంబురంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో 73, 74వ రాజ్యాంగ సవరణ, స్థానిక సంస్థలకు ప్రతిపత్తి కల్పించే అంశాన్ని తీసుకొచ్చారన్నారు.
దేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవంలో ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూట్టారని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : దొంగతాళంతో బైక్ చోరీ