పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రధాన రహదారి అంబేడ్కర్ చౌక్ చౌరస్తాలో మాదిగ యువసేన ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. హథ్రాస్ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యోగి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని మాదిగ యువసేన జాతీయ కో-ఆర్డినేటర్ సామ్యుల్ కోరారు.
భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో... ప్రధానంగా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. హత్యలు, అత్యాచారాలు అడ్డూఅదుపులేకుండా కొనసాగుతున్నాయని మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందు మాదిగ, కాసిపేట బానయ్య, కొయ్యల మొండి, కాసిపేట సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.