వామనరావు, నాగమణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని వారి మృతదేహాలను చూసేందుకు తరలి వచ్చి నిరసన చేపట్టారు.
ప్రభుత్వంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. న్యాయవాద దంపతుల కుటుంబాలను పరామర్శించారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు