రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను కలిసిన ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
కరోనా వ్యాప్తి కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగిందని, దీంతో ఉపాధ్యాయులకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 1500 నగదు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆసరా నిలించిందన్నారు. పాఠశాల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయుల వేతనాలు విషయంపై మాట్లాడామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్