ETV Bharat / state

సుందిళ్ల పంప్​హౌస్​ నుంచి నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధం - అన్నారం పంప్​హౌస్

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో దశ ఎత్తిపోతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్​ల నుంచి నీరు తరలిస్తుండగా... తాజాగా  సుందిళ్ల పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోతకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

సుందిళ్ల పంప్​హౌస్​ నుంచి నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధం
author img

By

Published : Jul 29, 2019, 11:57 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడోదశ నీటి ఎత్తిపోతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్నారం పంప్​హౌస్ నుంచి ఎత్తిపోసిన జలాలు సుందిళ్ల జలాశయంలోకి చేరాయి. సుందిళ్లలో ప్రస్తుతం ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ జలాలు సుందిళ్ల పంప్​హౌస్ ఫోర్​బేలోకి చేరాయి. నీటిని ఎత్తిపోయడానికి ఆరు పంపులు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో నాలుగింటిని ఆటోమోడ్​లో నడిచేలా అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ ఎత్తిపోసిన జలాలు ఎల్లంపల్లి శ్రీపాదసాగర్​కు చేరుకుంటాయి. సుందిళ్ల పంప్​హౌస్​ను ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితో పాటు ఇంజినీర్లు సోమవారం పరిశీలించారు. నీటి ఎత్తిపోతకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళ, బుధవారాల్లో సుందిళ్ల పంప్​హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసేలా ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశ ఎత్తిపోతలో భాగంగా కన్నెపల్లి పంప్​హౌస్ నుంచి ఆరు పంపుల ద్వారా 12 టీఎంసీల నీటిని తరలించగా... అన్నారం పంప్​హౌస్ నుంచి నాలుగు పంపుల ద్వారా ఐదు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోశారు. మేడిగడ్డ జలాశయంలో ప్రస్తుతం నాలుగు టీఎంసీలు, అన్నారం జలాశయంలో ఏడు టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది.

సుందిళ్ల పంప్​హౌస్​ నుంచి నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధం

ఇదీ చూడండి: వరుస కలిసింది.. గోదావరి పొంగింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.