ETV Bharat / state

ప్రమాదకర స్థితిలో ప్రభుత్వ పాఠశాల - manthini

గత వారం రోజులుగా వర్షాలు పడుతుండటం వల్ల పాఠశాల పైకప్పు నుండి పెచ్చులు ఉడి పడుతున్నాయి. ఈ పరిస్థితి పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ కేంద్రంలోని జేబీయస్ ప్రాథమిక పాఠశాలలో ఉంది.

ప్రమాద స్థితిలో ప్రభుత్వ పాఠశాల
author img

By

Published : Aug 8, 2019, 1:13 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ కేంద్రంలోని జేబీయస్ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో తయారైంది. 120 మంది విద్యార్థులు 5గురు ఉపాధ్యాయులు ఉన్న ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. వర్షపు నీరు కురుస్తుందని విద్యార్థులందరిని ఒకే రూమ్​లో కూర్చోబెట్టి బోధిస్తున్నారు. పాఠశాలలో విద్యుత్ సరఫరా కూడా లేకుండా బోధన జరుగుతోంది. కిటికీల తలుపులు విరిగిపోయి ఉన్నాయి. వర్షపు జల్లు కూడా లోపలికి వస్తుండడంతో, విద్యార్థులు చల్లటి గాలికి ఇబ్బంది పడుతున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరిందని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే వారే లేరని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే హాజరై విద్యాబోధన చేస్తున్నారు. ఈ విషయంపై మంథని భజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంథని మండల విద్యాధికారి పాఠశాలకు చేరుకుని ప్రత్యామ్నాయంగా మరో భవనానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.

ప్రమాద స్థితిలో ప్రభుత్వ పాఠశాల

ఇదీ చూడండి : 'కార్మికుల జీవితాలతో చెలగాటమాడొద్దు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.