పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా నిర్భయంగా ఉంటారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నూతనంగా నిర్మిస్తున్న రామగుండం కమిషనరేట్ కార్యాలయంతో పాటు గాంధీనగర్‌లో నిర్మిస్తున్న పోలీస్ అతిథి గృహం పనులను రామగుండం సీపీ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కమిషనరేట్ కార్యాలయాలతో పాటు నూతన పీఎస్‌లో నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని కోలేటి దామోదర్ తెలిపారు. పూర్తయిన కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలను త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రామగుండం కమిషనరేట్ పరిధిలో విశాలమైన కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న ఆలేరు కళాశాల