పెద్దపల్లి జిల్లా మంథనిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సామూహిక పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నాలుగు పోచమ్మ దేవాలయాల్లో గౌడ కులస్థులు బోనాలను సమర్పించి భక్తిని చాటుకున్నారు. పట్టణంలో నిర్వహించనున్న రేణుక ఎల్లమ్మ పట్నాల ఉత్సవాల్లో భాగంగా... ముందుగా గ్రామ దేవత అయిన పోచమ్మకు మొక్కులు చెల్లించారు.
కొత్తగా చేతికి వచ్చిన పంట బియ్యం, బెల్లంతో వండిన పాయసాన్ని బోనాలుగా చేసి 300 కుటుంబాలు... పిల్లాపాపలతో, డప్పు చప్పుళ్ళ మధ్య అమ్మవారికి సమర్పించారు. అనంతరం రేణుక ఎల్లమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. సుదూర ప్రాంతంలో ఉన్న గౌడ కుటుంబసభ్యులు కూడా గ్రామానికి వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు.