కేసీఆర్ సర్కార్ అన్ని రకాల కులవృత్తుల వారి అభివృద్ధికి అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టిందని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. మంథని, కమాన్పూర్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంథని మండలంలోని 8 గ్రామపంచాయతీలకు చేప పిల్లలను పంపిణీ చేశారు.
![peddapally zp chairman putta madhu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-106-21-chyrmenpumpiny-prarambothsavalu-av-ts10125_21092020134116_2109f_1600675876_885.jpg)
అనంతరం కమాన్పూర్ మండలం పెంచికల్పేట్లో పర్యటించిన పుట్ట మధు.. ఎస్ఈఆర్పీ, డీఆర్డీఓ ద్వారా మహిళా గ్రూపుల సమాఖ్య ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పరిశ్రమను ప్రారంభించారు. మహిళల సంక్షేమానికి తెరాస సర్కార్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని చెప్పారు. మహిళలు వ్యక్తిగతంగా నిలదొక్కుకునేలా సాయం చేస్తూ వారికి ఆర్థిక తోడ్పాటునందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అభినందనలు తెలిపారు.