పెద్దపల్లికి చెందిన బల్లా అలేఖ్య యూపీఎస్‌సీ పరీక్షల్లో ప్రతిభ చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 602వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన విశ్రాంత ప్రిన్సిపల్ బల్లా సత్తయ్య, రమాదేవి దంపతుల కూతురైన అలేఖ్య... గతేడాది ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ఎంపికై దిల్లీలో కస్టమ్స్ అధికారిగా శిక్షణ పొందుతున్నారు.
2018 గ్రూప్-1 పరీక్షలో డీఎస్పీగా ఎంపికైన ఆలేఖ్య రాష్ట్ర సర్వీసు వదిలేసి, యూనియన్ సర్వీస్‌లో చేరారు. ప్రస్తుత ర్యాంక్‌తో మెరుగైన సర్వీస్ వచ్చే అవకాశం ఉంది.