రాత్రిళ్లు ఆకతాయిల అరాచకాలను అరికట్టి శాంతిభద్రతల పరిరక్షించేందుకు పెద్దపల్లి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ చభుత్ర అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలో అర్ధరాత్రి దాటిన తర్వాత వీధుల్లో తిరుగుతున్న 43 మంది యువకులను అరెస్టు చేశారు. సదరు యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
రాత్రిళ్లు రోడ్లపై తిరగడం నిషేధించినట్లు పెద్దపల్లి ఏసీపీ హబీబ్ఖాన్ పేర్కొన్నారు. ఆపరేషన్ చభుత్ర నిత్యం అమల్లో ఉంటుందని రాత్రి పదిన్నర దాటిన తర్వాత వీధిలో తిరిగితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇవీ చూడండి: 'ప్రైవేటు సంస్థల్లో ఆధార్ ధ్రువీకరణ చట్టబద్ధమేనా?