పెద్దపల్లి జిల్లాలో ఆదివారం కరోనాతో తొలి మరణం నమోదైందని.. అయితే మృతదేహం తరలింపులో కింది స్థాయి ఉద్యోగులు భయాందోళనకు గురవుతారనే తానే స్వయంగా ట్రాక్టర్‌లో తరలించినట్లు జిల్లా సర్వేలైన్స్ అధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. సిబ్బందిలో స్ఫూర్తినింపడం... కుటుంబ సభ్యుల్లో మనోస్థైర్యం దెబ్బతినకుండా ఉండడానికి అలా చేసినట్లు చెప్పారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు చేసినట్లు పేర్కొన్నారు.
దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి హరీశ్ ట్విట్టర్‌లో అభినందనలు తెలపడంపై సంతోషం హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో కరోనా కట్టడికి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: డాక్టర్ మానవత్వం.. కరోనా మృతదేహం స్వయంగా తరలింపు
కరోనా మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన డాక్టర్.. హరీశ్ అభినందన
వైద్యుడు శ్రీరామ్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు