పెద్దపెల్లి జిల్లా మంథనిలోని కరీంనగర్ డెయిరీ మిల్క్ బల్క్ కూలింగ్ యూనిట్లో పాడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ చెలిమెడ రాజేశ్వరరావు, మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ పాల్గొన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం పాడి రైతులు బయట పాలు పొయ్యొద్దని పుట్ట మధు అన్నారు.
కరీంనగర్ డెయిరీలో పాలు పొయడం వల్ల పాడి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. కరీంనగర్ డెయిరీ వారు పాడి రైతులు, పశువుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. పశువుల కొనుగోలు చేసేందుకు రుణాలు, సభ్యుల పిల్లల పెళ్లిలకు పుస్తె మట్టెలు, చదువు కోసం స్కాలర్ షిప్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మంథని నియోజకవర్గంలో భాజపా నేతల ముందస్తు అరెస్టు