పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
బాధిత కుటుంబీలకు న్యాయం చేస్తాం..
బాధిత కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం తరఫున న్యాయం చేసి ఆదుకుంటామని ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్మిక కుటుంబీకులకు భరోసా కల్పించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కమిటీ వేయాలని కోరారు. బాధ్యులపై సింగరేణి యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మహాలక్ష్మి కంపెనీ కార్మికులే...
ఓబీ బ్లాస్టింగ్ చేసే సమయంలో నలుగురు ఒప్పంద కార్మికులు చనిపోగా మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిలో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉండటం హైదరాబాద్‌కు తరలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-1 పేస్-2లో ఉదయం షిఫ్ట్‌లో మహాలక్ష్మి కంపెనీకి చెందిన ఒప్పంద కార్మికులు ప్రమాదానికి గురయ్యారు.