ETV Bharat / state

Encounter: మంప ఎదురుకాల్పుల్లో.. పెద్దపల్లి జిల్లా మావోయిస్టు మృతి - Peddapalli district Maoist killed in police firing at mampa of vishaka district

ఏపీలోని విశాఖ జిల్లా మంప పీఎస్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పులు.. పెద్దపల్లి జిల్లాలో అలజడి సృష్టించింది. ఘటనలో తెలంగాణ వాసి చనిపోయినట్లు వార్తలు రావడంతో మృతుడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు.

telangana maoist died in police firing
పెద్దపల్లి జిల్లా మావోయిస్టు మృతి
author img

By

Published : Jun 16, 2021, 4:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్​ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు నేత సంద గంగయ్య అలియాస్ అశోక్ మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మావోయిస్టు గంగయ్య తల్లి అమృతమ్మ బోరున విలపించింది. తన కుమారుడు గంగయ్య ఎన్​కౌంటర్​లో మృతి చెందడం బాధాకరం అంటూ తన చిన్న కుమారుడు మహేందర్​ను పట్టుకొని కన్నీరుమున్నీరైంది.

1999లో అజ్ఞాతంలోకి వెళ్లిన గంగయ్య.. స్థానికంగా ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి రామస్వామి, తల్లి అమృతమ్మ దంపతులకు మొత్తం నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు రాజయ్య మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని 1996లో ఎన్​కౌంటర్​లో మృతి చెందాడు. ప్రస్తుతం మంప ఎదురుకాల్పుల్లో మృతి చెందిన గంగయ్య వారికి రెండో కుమారుడు.

మంప ఎదురుకాల్పుల్లో.. పెద్దపల్లి జిల్లా మావోయిస్టు మృతి

ఇదీ చదవండి: MAOIST JAGAN: 'ఆస్తుల రక్షణ కోసమే భాజపాలోకి ఈటల'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.