ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లి కష్టాలపాలై ఆపదలో ఉన్న తనను.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ పెద్దపెల్లి జిల్లాకు చెందిన వలస కూలీ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దకల్వల గ్రామానికి చెందిన కల్వల శంకరయ్య మూడేళ్ల క్రితం డ్రైవర్ ఉద్యోగం చేసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లినట్లు వీడియోలో తెలిపారు. అక్కడికి వెళ్లాక గొర్రెల కాపరిగా తనతో పనిచేయించుకుంటున్నారని ఆరోపించాడు. తనను స్వదేశానికి పంపించాలంటూ విన్నవించగా యజమాని పట్టించుకోవడంలేదని పేర్కొన్నాడు. వెంటనే ప్రభుత్వం తనను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.
ఇవీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: ఏంటీ ఆర్టికల్ 35-ఎ?