ప్రజలకు మౌలిక వసతులైన తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఆమె పర్యటించారు.
వార్డుల్లోకి వెళ్లి మౌలిక వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. ముందుగా మురికి కాలువలు పరిశీలించి విద్యుత్ తీగలు సవరించాలని కమిషనర్ శ్యాంసుందర్‌ను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వార్డులను సందర్శించారు. బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. రోగులకు మెరుగైన సదుపాయాలు అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ