ప్రచారం చేస్తున్న భాజపా ఎంపీ అభ్యర్థి కుమార్ పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని గోదావరి ఖని ఒకటో బొగ్గుగని వద్ద భాజపా ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు భాజపాకు ఓటేసి తనను గెలిపించాలని కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలికరించి ఓట్లను అభ్యర్థించారు. తన తండ్రి కూడా బొగ్గుగని కార్మికుడిగా పని చేశాడని గుర్తు చేశారు.
సమస్యలు పరిష్కరిస్తా..
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో తెరాస ఎంపీలు ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. తానూ సింగరేణి బిడ్డనేనని అన్నారు. దేశ అభివృద్ధికి మోదీ మరోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి :భాజపా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది