ETV Bharat / state

సమ్మె ఎఫెక్ట్: ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు - ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పండుగ కోసం ఎలాగో కష్టపడి ఊరు చేరుకున్న పెద్దపల్లి జిల్లా వాసులకు అక్కడ నుంచి గమ్యస్థానాలకు తిరిగి వెళ్లడానికి సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
author img

By

Published : Oct 10, 2019, 1:17 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికుల అవస్థలు పట్టించుకునే వారే కరువయ్యారు. దసరా పండుగకు ఎలాగోలా కష్టాలు పడి స్వగ్రామాలకు చేరుకున్నారు. కానీ పెద్దపల్లి జిల్లా మంథని డిపో నుంచి ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతాలకు అధికారులు బస్సులు నడపకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేసినా అధిక సంఖ్యలో బస్సులు లేకపోవడం వల్ల నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు బస్సులపై సరైన అవగాహన లేక.. ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు.

Intro:ప్రయాణికుల అవస్థలు.
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రయాణికులు అవస్థలు పట్టించుకునే వారే కరువయ్యారు.

దసరా పండుగకు ఎలాగో అలా అనేక కష్టాలు పడుతూ స్వగ్రామాలకు చేరుకున్నారు. దసరా అనంతరం నేడు ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు తిరిగి పోవడానికి సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు.

మంథని డిపో నుంచి అధికారులు ఎక్కువగా రద్దీ ఉన్న ప్రాంతాలకు బస్సులు నడవకపోవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అధిక చార్జీలు వసూలు చేస్తూ, వారి గ్రామాలకు పోయేందుకు అధిక సంఖ్యలో బస్సు లేకపోవడం వల్ల బస్సులో నిల్చొని ప్రయాణం చేస్తున్నారు. అంతేకాకుండా మంథని డిపో పరిధిలోని అనేక బస్సులు గమ్యస్థానాలకు చేరకముందే ఎక్కడికక్కడ మార్గ మధ్యంలోనే ఆగిపోతున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు ఉండడంవల్ల బస్సుల పై సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం అన్నిటినీ పరిశీలించే పంపుతున్నామని తెలుపుతున్నారు.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.