పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్లో కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. పోలీయో వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడి శస్త్రచికిత్సకు సహకరించినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని... మొగిలి శివసాయి రామ్ తల్లిదండ్రులు అన్నారు. ఈ బాలుడు చిన్నప్పటి నుంచి పోలియోతో ఇబ్బంది పడేవాడు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహకారంతో కేటీఆర్‌ను కలిసి శస్త్రచికిత్స చేయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందిన కేటీఆర్ 20లక్షలతో ఆపరేషన్ చేయించాడు. కృతజ్ఞతగా కాలనీవాసులతో కలిసి కుటుంబసభ్యులు వారి ఫొటోలకు పాలాభిషేకం చేశారు.
ఇవీ చూడండి: ఇంకా కుదుటపడని సచివాలయం పాలన