రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్న దృష్ట్యా... అత్యవసరాలను అధిగమించేందుకు ఆన్‌లైన్ ద్వారా జారీ చేస్తామని సీపీ వి.సత్యనారాయణ తెలిపారు.
ప్రజలు అత్యవసర పరిస్థితులకు అవసరమైన పాసుల కోసం https://tsp.koopid.ai/epass (తెలంగాణ పోలీస్ వెబ్సైట్), https://www.tspolice.gov.in/, రామగుండం పోలీస్ కమీషనరేట్ వెబ్సైట్ http://ramagundampolice.in/ ను ఉపయోగించి అవసరమైన వ్యక్తిగత ఐడిలతో దరఖాస్తు చేసుకోవచ్చని సీపీ తెలిపారు. దరఖాస్తు పరిశీలించి ఆన్‌లైన్ ద్వారా పాస్‌లను జారీ చేయడం లేదా తిరస్కరించడం జరుగుతుందన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.