ETV Bharat / state

కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలి: జేఏసీ - కార్మిక సంఘాల సమ్మె

దేశవ్యాప్తంగా ఈ నెల 26న చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కార్మికసంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు సమ్మెలో పాల్గొనాలని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో కార్మికసంఘాల సదస్సు నిర్వహించారు.

NTPC workers union demand to success strike in november twenty six
కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలి: జేఏసీ
author img

By

Published : Nov 11, 2020, 10:28 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26న చేపట్టిన సమ్మెను విజయవంతం చేసి సరైన బుద్ధి చెప్పాలని కార్మిక జేఏసీ సంఘం నాయకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో కార్మిక సంఘాల సదస్సును నిర్వహించారు. కార్మిక చట్టాలను సవరిస్తూ అన్యాయం చేస్తున్నారని అన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం పనికి సమానంగా రూ.21 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. మహిళల రక్షణ విషయంలో లైంగిక వేధింపులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్టీపీసీ కార్మికులు తప్పకుండా సమ్మెలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఉపేందర్‌, ముత్యం రావు, నరేశ్, రాజారత్నం, భూమయ్య, శ్రీనివాస్, నాగభూషణం, లక్ష్మారెడ్డి, సత్యం, లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'అప్పుడే మిషన్​ భగీరథ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరినట్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.