మంథని బస్టాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరానికి నూతన సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ మొదలైంది. దీన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ ప్రారంభించారు.
ఈ బస్సు మంథని నుంచి ప్రతిరోజు సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ధర్మవరం చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: దిగొచ్చిన పసిడి, వెండి- నేటి ధరలివే..