ఎండిన గోదావరినదికి జలకళ తెచ్చిన తెలంగాణ జల ప్రదాత సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరినది వద్ద జాతీయ జల క్రీడల శిక్షణతో పాటు.. అడ్వంచర్ ఆఫ్ అక్వా టూరిజం వారి నూతన పెడల్ బోటును ఎమ్మెల్యే ప్రారంభించారు.
రైతాంగ కష్టాలను తీర్చేందుకు..
స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. రైతాంగ కష్టాలను తీర్చేందుకు కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
సముద్రాన్ని తలపించే విధంగా..
కేంద్ర సహాయం లేకున్నా అతి తక్కువ కాలంలో కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం చేశారని సీఎంని కొనియాడారు. . కాళేశ్వర జలాలు గోదావరిఖని చేరిన వేళ ఎంతో గొప్పగా జలజాతర కార్యక్రమాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. సముద్రాన్ని తలపించే విధంగా నిండుకుండలాగా మారిన గోదావరినదిపై రెండు మార్లు తెప్పల పోటీలను నిర్వహించామన్నారు. గోదావరినది తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని.. ప్రజలు సాయంత్రం వేళల్లో అహ్లాదకరంగా గడిపెలా 80 సీట్లతో బోటును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్యే గంటా రాజీనామా.. ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం