పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక కోఆప్షన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, సుల్తానాబాద్ మున్సిపల్ ఛైర్మన్ సునీత సమక్షంలో నిర్వహించిన కో-ఆప్షన్ ఎన్నికల్లో మొత్తం నాలుగింటికి గాను 3 సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకుంది.
ఒక ఆప్షన్ మెంబర్‌ను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. హస్తం పార్టీ తరఫున గొట్ట మల్లయ్య కోఆప్షన్ సభ్యుడు అయిన తర్వాత తెరాస నుంచి సాజిద్, ఫాతిమా, రాధ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను సుల్తానాబాద్ పురపాలక కమిషనర్ శ్యాంసుందర్ నిర్వహించారు.
ఇవీ చూడండి : విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి: ప్రభాకర్‌రావు